శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 20:33:21

తెలంగాణ రౌండ‌ప్‌..

తెలంగాణ రౌండ‌ప్‌..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం.


రాష్ర్టంలోని రేష‌న్ కార్డు దారుల‌కు త్వ‌ర‌లోనే స‌న్న బియ్యం పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. జిల్లాలోని రంగాపూర్, సిరసపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి మంగ‌ళ‌వారం ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీ దూర‌విద్య కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని యూనివ‌ర్సిటీ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


దీపావళికి వారంరోజుల ముందే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలు కేటాయిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దివిటిపల్లి వద్ద డబుల్ బెడ్రూంల నిర్మాణ పనులతోపాటు మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల్ని ఆయన పరిశీలించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


‘ధరణి’ పోర్ట‌ల్‌పై తాసిల్దార్లకు, న‌యాబ్ తాసిల్దార్ల‌కు అనురాగ్ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ నెల 29న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభిస్తార‌ని తెలిపారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


బీజేపీ తెలంగాణ‌కు చేసిందేమీ లేదు అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. రైతుల‌ను క‌ష్టాల్లోకి నెడుతుంద‌న్నారు. వ్య‌వ‌సాయ పంపు సెట్ల వ‌ద్ద మీట‌ర్లు తెచ్చిపెట్టి.. రైతుల‌కు ఇబ్బందులు సృష్టిస్తుంద‌ని మంత్రి తెలిపారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలోని తొగుట‌లో టీఆర్ఎస్ యువ గ‌ర్జ‌న ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బైక్ ర్యాలీలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


దుబ్బాక ఉప ఎన్నికల నేప‌థ్యంలో సిద్దిపేట‌లో నిన్న చోటు చేసుకున్న‌ ఘటనలో పోలీసుల‌పై మీడియా ఛానెల్స్‌, సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని సిద్దిపేట సీపీ జోయ‌ల్ డేవీస్ స్ప‌ష్టం చేశారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల్లో పెండింగ్‌ ప‌నుల ప్రగతి, రైతు వేదిక‌ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై రోడ్ల ప‌నుల‌పై ఉన్నతాధికారులతో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆయన స‌మీక్ష నిర్వహించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాదని, ఆ పార్టీ నాయకులు చేసే గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


వరంగల్ రూరల్ జిల్లాలోని సంగెం మండలం గవి చర్ల వద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది. జీపులో 16 మంది ప్ర‌యాణికులున్న‌ట్లు సమాచారం. మ‌రింత స‌మాచారం కొర‌కు..


తాజావార్తలు