గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 19:22:18

విద్యుత్‌ అధికారులతో టీఎస్‌ ఎస్‌‌పీడీసీఎల్‌ సీఎండీ సమీక్ష

విద్యుత్‌ అధికారులతో టీఎస్‌ ఎస్‌‌పీడీసీఎల్‌ సీఎండీ సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్‌ సంస్థల పంపిణీ (టీఎస్‌ ఎస్‌‌పీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్‌ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ సరఫరాపై చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, ఎస్‌ఈలతో ఆయన చర్చించారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో 189 సెక్షన్‌స్థాయి విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి విభాగంలో ఏఈల ఆధ్వర్యంలో 25మంది సుశిక్షత విద్యుత్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. జిల్లా విద్యుత్‌ ఎస్‌ఈలు, డివిజనల్‌ ఇంజినీర్లు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్‌ అధికారులంతా ఎప్పటికప్పుడు పంపణీ పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పారు. విద్యుత్‌ పంపిణీలో అంతరాయం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo