శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 08, 2020 , 22:20:08

కొత్త విధానంలో ఫ్యాన్సీ నెంబరు దరఖాస్తు ఇలా

కొత్త విధానంలో ఫ్యాన్సీ నెంబరు దరఖాస్తు ఇలా

హైదరాబాద్ :  ఫ్యాన్సీ నెంబరుపై ఆసక్తి ఉన్న బిడ్డర్లు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌ http://transport.telangana.gov.in/ లోకి వెళ్ళి కుడివైపు ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే నెంబర్‌ రిజర్వేషన్‌ ఆనే లింకు కనబడుతుంది. దానిని ఓపెన్‌ చేస్తే ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్లు ప్రత్యక్షమవుతాయి. అందులో నచ్చిన నెంబరు కావాలనుకుంటే సంబంధిత నంబరు పేర్కొంటూ వాహన టీఆర్‌ నెంబరును ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. వివరాలు సమర్పించిన తర్వాత వాహనదారుడు ఎంచుకున్న నెంబరు ఆధారంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నంబర్‌ రిజర్వేషన్‌ కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్‌ మొత్తాన్ని చెల్లిస్తే 5 గంటల వరకు నెంబరు ఖరారై ప్రింట్‌ వస్తుంది. ఈ ప్రక్రియలో రిజిస్టర్‌ మొబైల్‌ నెంబరుకు సందేశం వస్తుంది. ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ఉదయం  10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 04023370081/83/84 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


logo