గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 07, 2020 , 16:02:03

టీఎస్ పాలిసెట్-2020 ప్ర‌వేశాల షెడ్యూల్ ఖ‌రారు

టీఎస్ పాలిసెట్-2020 ప్ర‌వేశాల షెడ్యూల్ ఖ‌రారు

హైద‌రాబాద్ : టీఎస్ పాలిసెట్-2020 ప్ర‌వేశాల షెడ్యూల్ ఖ‌రారు అయింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొద‌టి విడుత ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌ర‌గనుంది. 12 నుంచి 17వ తేదీ వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 14 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 14 నుంచి 20వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. 22న సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. 

30 నుంచి తుది విడుత ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌

ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. 30వ తేదీన‌, అక్టోబ‌ర్ 1న వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. అక్టోబ‌ర్ 3న తుది విడుత ప్ర‌వేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు చేస్తారు. అదే నెల 7వ తేదీ నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 15 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ప్ర‌యివేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిష‌న్ల‌కు అక్టోబ‌ర్ 8న మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయ‌నున్నారు. 


logo