మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 14:01:02

టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్ర పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులను ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలస్యంగా ఈ నెల 2న పరీక్ష నిర్వహించగా.. 56,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.polycetts.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా, ప్రవేశాల షెడ్యూల్‌ను ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12న పాలిసెట్‌ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ధ్రువీకరణపత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యార్థులు స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 14నుంచి18వ తేదీ వరకు పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. 14 నుంచి 20వ తేదీ వ‌ర‌కు వెబ్‌ ఆప్షను పెట్టుకోవచ్చు. 22న విద్యార్థులకు సీట్ల కేటాయిస్తారు. సీట్లు సొందిన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ జరుగనుంది. 30న, అక్టోబ‌ర్ 1న వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకోవాలి ఉంటుంది. అక్టోబ‌ర్ 3న తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్లను కేటాయిస్తారు. 7వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం 8న మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo