సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 22:44:29

పీఈసెట్‌ ఫలితాల్లో ఆకునూరు విద్యార్థినికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు

పీఈసెట్‌ ఫలితాల్లో ఆకునూరు విద్యార్థినికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు

చేర్యాల: బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీఈసెట్‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన రైతు జక్కు అయిలవ్వ-నర్సింహులు దంపతుల మొదటి కుమార్తె నవనీత స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ పాపిరెడ్డి శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. బీపీఎడ్‌ కోర్సులో ప్రవేశానికి మొత్తం 4265 మంది దరఖాస్తు చేసుకోగా, 2970 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2833 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. డీపీఎడ్‌ కోర్సులో ప్రవేశానికి 3103మంది దరఖాస్తు చేయగా, 1933మంది హాజరు కాగా, 1871మంది అర్హత సాధించారు. 

బీపీఎడ్‌ విభాగంలో ఆకునూరు గ్రామానికి చెందిన జక్కు నవనీత రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. నవనీత ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ పీఈసెట్‌కు హాజరై, రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవనీత స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించడంతో వ్యాయమ ఉపాధ్యాయుడు, హ్యాండ్‌బాల్‌ కోచ్‌ రఫత్‌ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థి నవనీతను అభినందించారు.