శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:55

అన్ని విధాలా రాష్ర్టాభివృద్ధి

అన్ని విధాలా రాష్ర్టాభివృద్ధి

  • మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టాన్ని అన్ని విధా లా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని, గ్రామీణ కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, టూరిజంశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. సోమవారం మండలిలో పలువురు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. గంగుల మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో తెలంగాణ సర్కారు 8.57 లక్షల రేషన్‌కార్డుదారులకు రూ.1,500 చొప్పున నగదు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం అందించినట్టు చెప్పారు. మంత్రి శ్రీని      వాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం సహా రిజర్వాయర్లను, ప్రధాన జలపాతాలను పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధిచేస్తున్నట్టు    వివరించారు


logo