ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 18:23:33

పౌల్ట్రీకి రూ.1525కే క్వింటా మక్కలు: తలసాని

పౌల్ట్రీకి రూ.1525కే క్వింటా మక్కలు: తలసాని

హైదరాబాద్‌: పౌల్ట్రీరంగాన్ని ఆదుకొనేందుకు క్వింటా మక్కలను రూ.1525 చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. తలసాని అధ్యక్షతన ఏర్పాటైన నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం  పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారని, ఈ కమిటీ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి ఉత్తమమైన పాలసీని రూపొందిస్తుందని పేర్కొన్నారు. కోళ్ల దాణాకు ఉపయోగించే మక్కలను భవిష్యత్‌లో ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరించి పౌల్ట్రీ పరిశ్రమకు సరఫరా చేయాలని యోచిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డితోపాటు పౌల్ట్రీరంగ ప్రతినిధులు పాల్గొన్నారు.


logo