గురువారం 28 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 18:07:26

ముదిరాజ్‌ భ‌వ‌న‌ నిర్మాణానికి మంత్రుల భూమిపూజ

ముదిరాజ్‌ భ‌వ‌న‌ నిర్మాణానికి మంత్రుల భూమిపూజ

హైద‌రాబాద్ : బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో భాగంగా కోకాపేటలో ముదిరాజ్‌లకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ భ‌వ‌న‌  నిర్మాణానికి ఆదివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీలు కేశవ్‌రావు, బండ ప్రకాశ్‌, రంజిత్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ బీసీల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా కోకాపేటలో 13 కులాలకు, ఉప్పల్‌ భగాయత్‌లో 25 కులాలకు, మల్కాజ్‌గిరి, బాట సింగారంలో 40 కులాలకు 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా భవన నిర్మాణాలకు గాను రూ.95.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని కులాల భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 


logo