సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 09, 2020 , 14:38:22

కావేటీ సమ్మయ్య మృతిపట్ల పలువురు మంత్రుల సంతాపం

కావేటీ సమ్మయ్య మృతిపట్ల పలువురు మంత్రుల సంతాపం

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే కావేటీ సమ్మయ్య మృతిపట్ల రాష్ట్ర మంత్రులు పలువురు సంతాపం ప్రకటించారు. సంతాపం ప్రకటించిన వారిలో సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ స్పందనను తెలియజేస్తూ... తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్‌ నాయకత్వంలో చురుగ్గా పనిచేశారని కొనియాడారు. కాగజ్‌నగర్‌లో తిరుగులేని ఉద్యమ నిర్మాణం చేశారని గుర్తుచేశారు. ఆయన మరణం తీరని లోటన్నారు. కావేటీ సమ్మయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 


logo