హైదరాబాద్ : ఈ నెల 23, 24 తేదీల్లో జరుగనున్న లాసెట్ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం ఏడుగంటల్లోగా డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ గురువారం సూచించారు. 21, 22 తేదీల్లో లాసెట్ వెబ్సైట్ పనిచేయదని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. మూడేండ్ల లా కోర్సుకు 28,904 మంది, ఐదేండ్ల కోర్సుకు 7,676 మంది, ఎల్ఎల్ఎం కోర్సుకు 3,286 మంది (మొత్తం 39,866) దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 47 కేంద్రాలు, ఏపీ నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.