శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:16:07

తప్పుల్లేకుండా పక్కా జాగ్రత్తలు

తప్పుల్లేకుండా పక్కా జాగ్రత్తలు

  • ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెకింగ్‌
  • రెండుమూడు రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల ప్రక్రియ పనులు అత్యంత పకడ్బందీగా సాగుతున్నాయి. ఫలితాలను ఒకటికి రెండుసార్లు క్రాస్‌చెక్‌ చేస్తున్నారు. సీజీజీ అధికారులతో కలిసి ఫలితాల్లో ఎలాంటి తప్పులు లేకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది ఫలితాల విడుదల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని త్రిమెన్‌ కమిటీ సూచించిన ప్రకారం ఫలితాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. రెండు లేదా మూడురోజుల్లో  ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు అధికారులు చెప్పారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు.


logo