సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 19:20:04

రేపు మధ్యాహ్నం ౩ గంటలకు ఇంటర్‌ ఫలితాలు

రేపు మధ్యాహ్నం ౩ గంటలకు ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానున్నాయి.  ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష  ఫలితాలు విడుదల  చేసేందుకు విద్యాశాఖ  అన్ని ఏర్పాట్లు చేసింది.  నాంపల్లిలోని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్‌ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ తెలిపారు. 

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకు కొనసాగిన విషయం విదితమే.


logo