గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:26:30

ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. జూనియర్‌ కాలేజీల అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్‌ బోర్డు నేడు విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలను 220 రోజులకు బదులు 182 రోజులుగా పేర్కొంది. ఈ నెల 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లుగా పేర్కొంది. దసరాకు ఆదివారంతో కలిపి మూడు రోజులు(అక్టోబర్‌ 23, 24, 25) అదేవిధంగా సంక్రాంతికి రెండు రోజులు(జనవరి 13, 14) మాత్రమే సెలవులుగా ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షల నిర్వహణ. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు వార్షిక పరీక్షలు. ఏప్రిల్‌ 17 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు. మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు. జూన్‌ 1వ తేదీన తిరిగి ప్రారంభం కానున్న ఇంటర్‌ కాలేజీలు. కరోనా దృష్ట్యా ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ బోర్డు 38 పనిదినాలను తగ్గించింది. 


logo