శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 17:26:51

రేపు టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు

రేపు టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ (తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర  ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి  మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయన్నారు. టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలను ఈ సారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది.

సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. టీఎస్ ఐసెట్‌ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మొత్తం 58,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని 70 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.