శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 17:52:37

యువ‌త‌కు పెద్దఎత్తున ఉపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం కృషి : స‌బితా ఇంద్రారెడ్డి

యువ‌త‌కు పెద్దఎత్తున ఉపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం కృషి : స‌బితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : యువతకు ప్రభుత్వ రంగంతో పాటు, ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న‌ట్లు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజర‌య్యారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా నాయకులు, కో ఆర్డినెటర్లు చొరవ చూపాల‌న్నారు. అదేవిధంగా ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. యువత, విద్యార్థులు ఎప్పటికి టీఆర్ఎస్ వెన్నంటే ఉంటార‌న్నారు.