శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 17:55:16

గొర్రెకుంట మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి

గొర్రెకుంట మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ : వరంగల్‌ నగర శివారు గొర్రెకుంట బావిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్‌ అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. వరంగల్‌ ఎంజీఎంలో మృతదేహాలను సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... మృతి ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలు కోరికపై ఇక్కడే అంత్యక్రియలు చేయడం గానీ లేదా వారి సొంతూళ్లకు పంపించడం గానీ చేస్తామన్నారు. గొర్రెకుంటలో గల పాత బావిలో నిన్న నాలుగు మృతదేహాలు, నేడు ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు ఆరుగురు పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు కాగా మరో ఇద్దరు బిహార్‌కు చెందినవారు, మరో వ్యక్తి త్రిపురకు చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


logo