శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 06, 2020 , 15:19:04

పంటల కొనుగోళ్లు ప్రారంభం..ఫొటోలు

పంటల కొనుగోళ్లు ప్రారంభం..ఫొటోలు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఇవాళ ప్రారంభించారు. రైతుల పంటలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రైతులు తమ పంటలను దళారుల చేతుల్లో పెట్టి, మోసపోకుండా.. ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపట్టింది. మక్కలు, శనగలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.  

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని  మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ప్రారంభించారు. 

వనపర్తి జిల్లాలోని  రేవల్లి, గోపాల్పేట్,  పెద్దమందడి, కిల్ల గణపురం మండలాల్లో వరి ధాన్యం కొనుగోళ్లను   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. 

నిర్మల్‌ జిల్లాలోని సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల జిల్లా రాయికల్ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు  కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.