మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 21:10:00

వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న రేష‌న్ కిట్ వివ‌రాలు

వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న రేష‌న్ కిట్ వివ‌రాలు

హైద‌రాబాద్ : గ‌డిచిన నాలుగైదు రోజులు హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసిన సంగ‌తి తెలిసిందే. కుండ‌పోత వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. అపార్ట్‌మెంట్లు సెల్లార్లు, ప‌లు ఇండ్లు, కాల‌నీలు నీట‌మునిగాయి. ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో భాగంగా వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కిట్ సరుకులను అందిస్తుంది. కిట్‌లో అందించే స‌రుకుల వివ‌రాలిలా ఉన్నాయి. 

బియ్యం - 5kg

పప్పు - 1kg

వంట నూనె - 500ml

కారంపొడి - 200 gm

పసుపు - 100 gm

ఉప్పు - 1kg

చింతపండు - 250 gm

గోధుమ పిండి - 1kg

చాయ్ పత్తి - 100 gm

చక్కెర - 500 gm

వీటితో పాటు ఒక దుప్పటి ఇస్తున్నారు.


logo