బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 21:24:17

వరద ప్ర‌భావం‌... ఉచితంగా విద్యార్హత ధ్రువపత్రాలకు ఆదేశం

వరద ప్ర‌భావం‌... ఉచితంగా విద్యార్హత ధ్రువపత్రాలకు ఆదేశం

హైదరాబాద్‌ : ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కుంభవృష్టి కారణంగా వరదలు పోటెత్తి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, పలు అపార్ట్‌మెంట్లు నీటమునిగాయి. ఈ క్రమంలో వరదల్లో తమ విద్యార్హత ధ్రువపత్రాలు పోయాయని ప్రభుత్వానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బాధితులకు ఉచితంగా విద్యార్హత ధ్రువపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల, ఇంటర్‌, సాంకేతిక విద్యాశాఖలు, వర్సిటీలను ఈ మేరకు ఆదేశించింది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక సీఎస్‌ తెలిపారు.