ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం

- రిటైర్మెంట్ వయసుపైనా నిర్ణయం!
- శరవేగంగా పదోన్నతుల ప్రక్రియ
హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతనాల పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఉద్యోగులకు ఏ క్షణంలోనైనా ఫిట్మెంట్ ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 20 తర్వాత ఎప్పుడైనా సీఎం కేసీఆర్ వేతన పెంపు ప్రకటనచేస్తారని ఉద్యోగవర్గాలు నమ్మకంతో ఉన్నాయి. తమ కోరిక మేరకు మంచి ఫిట్మెంట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు ఉద్యోగసంఘాల నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో ట్రెజరీ ద్వారా వేతనాలు అందుకొంటున్న 2.90 లక్షల మందికి కొత్త ఫిట్మెంట్ వర్తించనున్నది. ఇతర ఉద్యోగులతో కలు పుకొని 9.36 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఉద్యోగసంఘాల నేతలు అంటున్నారు.
వేగంగా పదోన్నతుల ప్రక్రియ
సీఎం కేసీఆర్ హామీ మేరకు వివిధ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ఉద్యోగులకు ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయసు పెంపు, పదోన్నతులకు కనీస సర్వీసు కాలాన్ని మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదింపు అంశాలను ఒకే ప్యాకేజీ కింద ప్రకటిస్తామని ముందుగా చెప్పినప్పటికీ.. పదోన్నతుల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో.. సర్వీసు కుదింపునకు సంబంధించి ముందుగానే విడిగా జీవో విడుదలచేశారని ఉద్యోగసంఘాల నేత ఒకరు తెలిపారు. దీనివల్ల 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తున్నాయని వివరించారు. ఇక మిగిలింది ఫిట్మెం ట్, పదవీవిరమణ వయస్సు పెంపు మాత్రమేనన్నా రు. ఫిట్‌మెంట్‌పై.. ఇప్పటికే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందింది.
ఈ నివేదికపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సీఎం కేసీఆర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ నివేదికను కూలంకషంగా అధ్యయనం చేసి.. అందులోని సారాంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించింది. దీనిపై సీఎం కేసీఆర్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఉద్యోగ సంఘాలు, టీఎన్జీవో, టీజీవో, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఫిట్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. అధికారులు అడిగిన సందేహాలకు కావాల్సిన సమాధానాలు, సమాచారాన్ని అందిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సమాచారం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ నెల 20వ తేదీ తరువాత ఏ క్షణమైనా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘా ల నేతలు విశ్వాసంతో ఉన్నారు.
తాజావార్తలు
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం
- 'షాదీ ముబారక్' ప్రీ రిలీజ్ బిజినెస్: అంతా దిల్ రాజు మహిమ