ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 13:24:08

పూర్తిస్థాయి వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ

పూర్తిస్థాయి వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌ : ఉద్యోగులు, పింఛనుదారులకు పూర్తి వేతనాల చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నుంచి వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన బకాయిలకు విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. కోవిడ్‌-19 వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

దీంతో ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో విధించిన కోత పరిస్థితుల కారణంగా ఏప్రిల్‌, మే నెలలో కూడా కొనసాగింది. కాగా లాక్‌డౌన్‌ దశ ముగిసి ఆన్‌లాక్‌ కొనసాగుతుండటం.. ఇప్పుడుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుండటంతో ఈ నెల పూర్తి వేతనాలు చెల్లించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. logo