గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:23:29

రొబోటిక్‌ శానిటైజర్‌

రొబోటిక్‌ శానిటైజర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రొబోటిక్‌ శానిటైజర్‌ వాహనానికి రూపకల్పనచేసి, ఉత్పత్తిచేయడానికి హైదరాబాద్‌ సైన్స్‌ సొసైటీచేసిన కృషిని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రశంసించారు. హైదరాబాద్‌ సైన్స్‌ సొసైటీ ప్రతినిధులు త్రిపురనేని వరప్రసాద్‌, సంజార్‌ అలీఖాన్‌.. రొబోటిక్‌ శానిటైజర్‌ వాహనం గురించి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి, అధిగమించడానికి కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఈ సందర్భంగా గవర్నర్‌ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నివారణ, నియంత్రణపై పరిశోధనలు పెంచాలని సూచించారు.


logo