బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:29:23

నకిలీలను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌

నకిలీలను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌

  • గ్రామసభలు, మండల కమిటీలు రద్దు 
  • రుణమాఫీకి మార్గదర్శకాలు
  • బ్యాంకు మేనేజర్లకు ప్రత్యేక అధికారాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రుణమాఫీ మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పు లు చేసింది.  లబ్ధిదారులను గుర్తించేందుకు నిర్వహించే సోషల్‌ ఆడిటింగ్‌ కోసం జరిగే గ్రామసభలను రద్దు చేశారు. సంయుక్త మండలస్థాయి కమిటీలను కూడా తొలిగించింది. బోగస్‌ లబ్ధిదారుల ను, ఒకటి కంటే ఎక్కువ రుణాలున్న వారికి గుర్తించేందుకు ఎన్‌ఐసీతో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీంట్లోనే రైతుల ఆధార్‌ నంబర్లను నమోదుచేస్తారు. దీని ఆధారంగానే రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ఒకటి రెండు రో జుల్లో ముగియనుంది. అర్హులైన రైతుల ఖాతాల కు ఈ-కుబేర్‌ ద్వారా రుణమాఫీ సొమ్మును జమ చేయనున్నారు. అర్హులైన రైతులను గుర్తించేందు కు బ్యాంకు మేనేజర్లకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను కల్పించింది. రైతు అనర్హుడైతే వారి సొ మ్మును వెనుక్కు తీసుకొని వ్యవసాయశాఖకు జమచేస్తారు. ఆధార్‌ నంబర్‌లేని రైతులకు 15 త ర్వాత రుణమాఫీ సొమ్మును జమచేయనున్నారు. 


logo