బుధవారం 27 మే 2020
Telangana - May 14, 2020 , 01:29:53

కల్లుగీతకు అనుమతి

కల్లుగీతకు అనుమతి

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సర్క్యులర్‌ జారీ
  • భౌతికదూరం తప్పనిసరి
  • కల్లుదుకాణాలు తెరుచుకోవు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ కల్లుగీసి అమ్ముకోవడానికి  ప్రభుత్వం అనుమతిచ్చింది. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కల్లు గీసుకోవచ్చని, కానీ, కల్లు దుకాణాలు తెరువకూడదని బుధవారం ఎక్సైజ్‌శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాకు వెల్లడించారు. కల్లుగీతకార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఆబ్కారీశాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, గౌడ సంఘాల నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలరాజ్‌గౌడ్‌, రాష్ట్ర కన్వీనర్‌ వెంకన్నగౌడ్‌, ప్రధాన కార్యదర్శి రమణ కృతజ్ఞతలు తెలిపారు. 


logo