సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 10:49:28

ఒకటో తారీఖు నుంచి పిల్లలు టీవీలో పాఠాలు వినాలహో...

ఒకటో తారీఖు నుంచి పిల్లలు టీవీలో పాఠాలు వినాలహో...

హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు పాఠాలు వినాలని ఊరూరా దండోరా వేయిస్తున్నారు. దూరదర్శన్‌, టీశాట్‌ ఛానళ్ల ద్వారా ప్రభుత్వం పాఠాలు ప్రసారం చేస్తున్నదని, 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వారి వారి ఇళ్లలోనే పాఠాలు వినాలని చెబుతున్నారు. పాఠాలు వినేవిధంగా పిల్లలకు తల్లిదండ్రులు  సహకరించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో చాటింపు వేసి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలకు సంబంధించి టైంటేబుల్‌, ఏర్పట్ల గుంచి చాటింపు వేసిన వీడియో చూడండి..logo