గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 20:14:07

మత్స్యసాగులో టీఎస్‌ ఫిషరీష్‌కు మొదటి బహుమతి

మత్స్యసాగులో టీఎస్‌ ఫిషరీష్‌కు మొదటి బహుమతి

హైదరాబాద్‌ : మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్రంలోని నీటి వనరుల్లో సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం గుర్తింపును పొందింది. కేంద్ర మత్స్య మంత్రిత్వశాఖ నుండి తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంఘాల సమాఖ్య లిమిటెడ్‌ మరో ప్రధాన గుర్తింపును పొందింది. ఇన్లాండ్‌ కేటగిరిలో మొదటి బహుమతి గెలుచుకుంది. ఫెడరేషన్‌ కేంద్రం ప్రభుత్వం నుండి ఓ మెమొంటో తోపాటు రూ. 5 లక్షల నగదు బహుమతిని అందుకుంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేస్తూ ఫిషరీష్‌ విభాగానికి అభినందనలు తెలిపారు. ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఆకాంక్షించారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలోని నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. వీటిని ఉపయోగించుకుంటూ మత్య్సకారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తూ వారి అభివృద్ధికి చేయూతనిస్తుంది.


logo