ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 12:50:20

టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్రాంగణంలో ఎడ్‌సెట్ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారు. ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 97.58 శాతం మంది విద్యార్థులు అర్హ‌త సాధించార‌ని పాపిరెడ్డి తెలిపారు. ఈ ఫ‌లితాల్లో అమ్మాయిలు 76.07 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌న్నారు. 206 బీఈడీ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయ‌ని పాపిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఫ‌లితాల కోసం https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.