గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 06:27:46

నేడు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు

నేడు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌ ఎడ్‌సెట్‌) -2020 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఓయూ ప్రాంగణంలోని యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేష‌న్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి  ఫలితాలు విడుదల చేయనున్నారు.

రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ అక్టోబర్‌ 1, 3వ తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థుల ర్యాంకుల ఆధారంగా కళాశాలలను కేటాయించనున్నారు.  భారీ వర్షాల కారణంగా ఈ నెల 21న ప్రకటించాల్సిన ఫలితాలను.. 28వ తేదీకి వాయిదా వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.