మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 20:11:42

రేపు టీఎస్‌ ఈసెట్‌-2020 ఫలితాల వెల్లడి

రేపు టీఎస్‌ ఈసెట్‌-2020 ఫలితాల వెల్లడి

హైదరాబాద్‌ : తెలంగాణ ఈసెట్‌-2020 ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ టి. పాపిరెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకు జేఎన్‌టీయూ ప్రాంగణంలోని యూజీసీ-హెచ్‌ఆర్‌డీసీ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. అధికారి వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in  నుంచి విద్యార్థులు ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఆగస్టు 31వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 25,448 మంది పరీక్షకు హాజరయ్యారు. కోవిడ్‌-10 నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో 52, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించారు.


logo