మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:03

ఈసెట్‌లో 97.58% అర్హత

ఈసెట్‌లో 97.58% అర్హత

 • ఫలితాలు విడుదల.. 16 నుంచి అడ్మిషన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నిర్వహించిన ఈసెట్‌లో 97.58% అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 63.49% మంది బాలురు ఉండగా, బాలికలు 98.29% ఉన్నారు. ఈ ఫలితాలతోపాటు ఈసెట్‌ ఫైనల్‌ కీని శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సెకండియర్‌ అడ్మిషన్ల కోసం గత నెల 31న నిర్వహించిన ఈసెట్‌కు 28,041 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా, 25,448 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 మంది అర్హత సాధించినట్టు పాపిరెడ్డి తెలిపారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచామని చెప్పారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో లాటరల్‌ ఎంట్రీ కోసం ఈ నెల 16 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నదని తెలిపారు.  కార్యక్రమంలో ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌హుస్సేన్‌, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

19 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

 • ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైంది. వివరాలు ఈ నెల 15 నుంచి https://tsecet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అడ్మిషన్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. 

తొలి విడుత షెడ్యూల్‌ ఇదీ..

 • సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ 16-09-2020 నుంచి 23-09-2020 వరకు
 • సర్టిఫికెట్ల పరిశీలన 19-09-2020 నుంచి  23-09-2020 వరకు
 • వెబ్‌ ఆప్షన్ల నమోదు  ప్రక్రియ 19-09-2020 నుంచి  25-09-2020 వరకు
 • ఫ్రీజింగ్‌ ఆప్షన్‌ 25-09-2020
 • తొలివిడుత సీట్ల కేటాయింపు 28-09-2020
 • వెబ్‌సైట్‌ ద్వారా కాలేజీల్లో రిపోర్టింగ్‌ 28-09-2020 నుంచి  03-10-2020 వరకు

తుది విడుత కౌన్సెలింగ్‌ తేదీలు..

 • వెబ్‌ ఆప్షన్ల నమోదు 06-10-2020 నుంచి 07-10-2020 వరకు     
 • ఫ్రీజింగ్‌ ఆప్షన్‌ 07-10-2020
 • సీట్ల కేటాయింపు 09-10-2020
 • ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌లో రిపోర్టింగ్‌ 09-10-2020 నుంచి  12-10-2020 వరకు
 • కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్‌ 09-10-2020 నుంచి  12-10-2020 వరకు
 • క్లాస్‌వర్క్‌ 12-10-2020 నుంచి..
 • స్పాట్‌ అడ్మిషన్లు 09-10-2020


logo