శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 19:32:33

ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఖరారు

ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఖరారు

హైదరాబాద్‌ : ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 19 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు బుకింగ్‌ నమోదు చేసుకోవాలి. ఈ నెల 20, 21న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు గడు ఇచ్చారు. ఈ నెల 24న ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది. అదేవిధంగా చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. డిసెంబర్‌ 2న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు గడువు ఇచ్చారు. డిసెంబరు 5న అభ్యర్థులకు ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది.