శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 03:02:18

నేడు కొవిడ్‌ విద్యార్థులకు ఎంసెట్‌

నేడు కొవిడ్‌ విద్యార్థులకు ఎంసెట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొవిడ్‌ వచ్చి తగ్గిన విద్యార్థులకు గురువారం జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 12.30 గంటల్లోగా చేరుకోవాలి. ఎల్‌బీనగర్‌లోని ఐవోఎన్‌ డిజిటల్‌ జోన్‌ ఐడీజెడ్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 14 మధ్యలో కొవిడ్‌ సోకి, ఆ తర్వాత నెగిటివ్‌ వచ్చినట్లుగా రిపోర్టులు కూడా పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుందని జేఎన్‌టీయూహెచ్‌ వెల్లడించింది.