ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 01:11:08

జేఈఈకన్నా ముందే టీఎస్‌ ఎంసెట్‌!

జేఈఈకన్నా ముందే టీఎస్‌ ఎంసెట్‌!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్‌, ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జూలై 26న నీట్‌, ఆ తర్వాతి రోజే ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ జరుగనున్నాయి. దాంతో ఈ పరీక్షలకన్నా ముందే తెలంగాణ ఎంసెట్‌ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టే అవకాశాలను ఉన్నతవిద్యామండలి పరిశీలిస్తున్నది. జూలైలో సాధ్యంకాకుంటే ఆగస్టు మొదటివారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. టీఎస్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు 15 వరకు ఉన్నది. దానిని ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశాలున్నాయి.


logo