సోమవారం 01 జూన్ 2020
Telangana - May 13, 2020 , 06:34:57

2 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు

2 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు

హైదరాబాద్ : టీఎస్‌ ఎంసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తులు రెండులక్షలు దాటాయి. మంగళవారంవరకు 2,00,896 దరఖాస్తులను స్వీకరించామని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌లో 1,30,075, అగ్రికల్చర్‌/మెడికల్‌ విభాగంలో 70,821 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉన్నది. గడువు తేదీని పొడిగించే ఆలోచనలో ఉన్నత విద్యామండలి ఉన్నట్టు తెలిసింది. 


logo