మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 15:45:53

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫలితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. జేఎన్టీయూ క్యాంప‌స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి, ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవ‌ర్ధ‌న్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 89,734 మంది(75.29 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం www.ntnews.com  వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. 

ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు 1,43,326 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తంగా 89,734 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. 


logo