e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News 'ధ‌ర‌ణి' ఫిర్యాదుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆదేశం

‘ధ‌ర‌ణి’ ఫిర్యాదుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆదేశం

'ధ‌ర‌ణి' ఫిర్యాదుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆదేశం

హైద‌రాబాద్ : ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అందిన ఫిర్యాదుల‌ను వీలైనంత తొంద‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారుల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై సంబంధిత అధికారుల‌తో సీఎస్ శుక్ర‌వారం బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌మ‌న్వ‌యంతో ప్ర‌తీరోజు ద‌ర‌ఖాస్తుల పెండింగ్‌ల స్థితిని అధికారులు ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. వాట్సాప్, ఈ మెయిల్ మొదల‌గు మార్గాల్లో అందిన అన్ని ఫిర్యాదులపై ప్రామాణిక స్పందన ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాల‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్, ఇతర సమస్యలను సీఎస్ భేటీలో స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో వి. శేషాద్రి ఐఏఎస్‌, ఆర్థిక‌శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రోనాల్డ్ రోస్‌, వ్య‌వ‌సాయ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు, జీటీ వెంక‌టేశ్వ‌ర్ రావు ఐఆర్ఎస్‌, టీఎస్‌టీఎస్ ఎండీ స‌త్య శార‌ద‌, సీసీఎల్ఏ ప్ర‌త్యేక అధికారి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

'ధ‌ర‌ణి' ఫిర్యాదుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆదేశం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'ధ‌ర‌ణి' ఫిర్యాదుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆదేశం

ట్రెండింగ్‌

Advertisement