శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 00:47:27

అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికలు

అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికలు

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అధికారులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా పనిచేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 10వ తేదీనాటికి  రైతు వేదికల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. బుధవారం పట్టణ ప్రగతి, రైతు వేదికల నిర్మాణం, మున్సిపాలిటీల్లో కొత్తగా చేర్చిన గ్రామపంచాయతీల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ పనుల పర్యవేక్షణకు సీనియర్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని చెప్పా రు. ఈ నెల 18 నాటికి ఫిజికల్‌ గ్రౌండింగ్‌ పూర్తిచేయాలని, నిర్మాణానికి అవసరమైన సామగ్రి సేకరణకు ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో కొత్త గా విలీనమైన గ్రామాలను శరవేగంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, క్రిమి సం హారక మందుల పిచికారీ, యాంటీ లార్వ ల్‌, వెక్టర్‌ బోర్న్‌ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పా రు.  రాష్ట్రంలోని 29 జిల్లాల్లో స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకం పూర్తయిందని తెలిపారు.  


logo