గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 06:41:01

లాక్‌డౌన్‌పై క్యాబినెట్‌లో నిర్ణయం

లాక్‌డౌన్‌పై క్యాబినెట్‌లో నిర్ణయం

  • 7వ తేదీ వరకు యథాతథ స్థితి: సీఎస్‌

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం ఈ నెల 7 వరకు విధించిన లాక్‌డౌన్‌ను యథావిధిగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ పొడిగింపు, నిబంధనల సడలింపు తదితర అంశాలపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 


logo