సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 14:38:21

సా. 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సా. 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌  : ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. శాసనసభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను హరీష్‌రావు తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. బడ్జెట్‌ను 8వ తేదీన ప్రవేశపెట్టిన అనంతరం సభను వాయిదా వేయనున్నారు. మళ్లీ 11వ తేదీన తిరిగి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 


logo