e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం

‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం

‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర‌ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రివ‌ర్గం ఆదేశించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.

రూ.25 వేల కోట్ల పెట్టుబ‌డి.. 70 వేల మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి

ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం రెండో రోజు కొన‌సాగింది. స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ‌పై కేబినెట్ స‌మ‌గ్రంగా చ‌ర్చించింది. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను సీఎం నేతృత్వంలోని మంత్రివ‌ర్గం బృందం చ‌ర్చించింది. ఈ క్ర‌మంలో భాగంగానే తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాల‌సీని కేబినెట్ చ‌ర్చించి ఆమోదించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయం. తద్వారా సుమారు రూ. 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి మ‌రో 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌కు షెడ్ల నిర్మాణం..

- Advertisement -

విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు , పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోల్లు, పాలు మరియు డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం.

జులై 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయం. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్థుతం జూలై 12 వరకు వున్న ఆఖరు తేదీని జులై 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయం. ఈ పాలసీ లో రూపొందించిన మార్గదర్శకాల పై కేబినెట్ చర్చించింది. రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి మరియు మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని కేబినెట్ నిర్ధారించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని నిర్ణయం.

ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం..

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయం. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ఎస్సీ ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయం. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా..


1) కరెంటు సబ్సిడీని ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా అందించాలని నిర్ణయం
2) పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని (రెండు కోట్లకు మించకుండా) రీయింబ‌ర్స్ చేయాలని నిర్ణయం
3) మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రీయింబర్స్‌మెంట్ చేయాలని నిర్ణయం
4) ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని నిర్ణయం

వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అద‌నపు ప్రోత్సహకాలందించాలని కేబినెట్ నిర్ణయించింది. పైన తెలిపిన సాధారణ ప్రోత్సహకాలకు అదనంగా..
1) 15 శాతం మూలధనాన్ని (20 లక్షలకు మించకుండా) మంజూరు చేయాలని నిర్ణయం
2) మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబ‌ర్స్‌మెంట్ (85 శాతం)( రూ.2 కోట్ల వడ్డీకి మించకుండా)
3) అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ (20 లక్షలకు మించకుండా సబ్సిడీ)


స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు (ఎఫ్ పీ వో ) లకు కూడా అద‌నపు ప్రోత్సహకాలు అందించాలని (పైన తెలిపిన‌ సాధారణ ప్రోత్సహకాలకు అద‌నంగా…) కేబినెట్ నిర్ణయించింది ఇందులో భాగంగా..
1) 15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి మించకుండా) చేయాలని నిర్ణయం
2) మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబ‌ర్స్‌మెంట్ (80 శాతం)(రూ.2 కోట్ల వడ్డీకి మించకుండా)
3) భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ (20 లక్షలకు మించకుండా) అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం
‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం
‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం

ట్రెండింగ్‌

Advertisement