శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 07:28:33

నేటి నుంచి అమలులోకిరానున్న టీఎస్‌ బీపాస్‌

నేటి నుంచి అమలులోకిరానున్న టీఎస్‌ బీపాస్‌

హైదరాబాద్‌: పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇక సులభతరం కానున్నాయి. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన టీఎస్‌బీపాస్‌ నేటినుంచి అమల్లోకి రానుంది. ఇవాళ ఉదయం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్‌ అధికారికంగా ప్రారంభిస్తారు. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది.

దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీచేయనున్నారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాల లోపు ఇండ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు. ఈ భవనాల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు జారీచేస్తారు. రూపాయి చెల్లించి టీఎస్‌బీపాస్‌ కింద నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ వెబ్‌సైట్‌ తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.