ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 03:00:56

నాలా చట్ట సవరణ గెజిట్‌ విడుదల

నాలా చట్ట సవరణ గెజిట్‌ విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫర్‌ నాన్‌ అగ్రికల్చర్‌ పర్పస్‌ (నాలా)  చట్టానికి ప్రభు త్వం చేసిన సవరణ గెజిట్‌ శుక్రవారం విడుదలైంది. వ్యవసాయ భూములను అవసరాలను బట్టి వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియలో ఆర్డీవోలకు విచక్షణాధికారాలు ఉండటంతో అవినీతికి ఆస్కారమవుతున్నదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విచక్షణాధికారాలను తొలిగిస్తూ, ధరణిలోనే నాలా కన్వర్షన్‌ పూర్తయ్యే లా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన అసెంబ్లీ ప్రత్యే క సమావేశాల్లో దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. అనంతరం 15న గవర్నర్‌ తమిళిసై సంతకం చేశారు. ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ జారీ విడుదల చేసింది. 


logo