సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 13:27:14

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురు మృతి

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్లలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనస పండ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే తమిళనాడు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ.. ఏఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వద్ద ఆగింది. విరామం అనంతరం జాతీయ రహదారి 44పైకి వెళ్తున్న క్రమంలో లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదస్థలి వద్దకు పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఘటనాస్థలిని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే.logo