మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 21:47:14

ట్రక్కు బోల్తా.. టీవీఎస్‌ మోపెడ్ వాహనాలు ధ్వంసం

ట్రక్కు బోల్తా.. టీవీఎస్‌ మోపెడ్ వాహనాలు ధ్వంసం

మహబూబాబాద్‌ : టీవీఎస్‌ మోపెడ్లను‌ తరలిస్తున్న ట్రక్కు బోల్తాపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా గూడూర్‌ మండలం పొనుగోడు సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కరీంనగర్‌ నుంచి టీవీఎస్‌ మోపెడ్లను రాజమండ్రికి తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ట్రక్కులో ఉన్న 38 కొత్త టీవీఎస్‌ మోపెడ్లు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు డ్రైవర్‌ వాపోయాడు. డ్రైవర్‌, క్లీనర్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.