బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Jun 15, 2020 , 00:46:45

తీన్మార్‌ మల్లన్నపై టీఆర్‌ఎస్వీ ఫిర్యాదు

తీన్మార్‌ మల్లన్నపై టీఆర్‌ఎస్వీ ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుటుంబంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌కుమార్‌, గంగాధర్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తీన్మార్‌ మల్లన్న కొంతకాలంగా యూట్యూబ్‌ చానల్‌లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్న వీడియోలను పెడుతూ ఆయన కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేస్తున్నదన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీని రెండోసారి గెలిపించారని గుర్తు చేశారు. అసత్యాలు ప్రచారాలు చేసే ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్టు ఆయన చెప్పారు.logo