శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 23:04:24

ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు: టీఆర్‌ఎస్వీ

ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు: టీఆర్‌ఎస్వీ

ఉస్మానియా యూనివర్సిటీ : ఉద్దేశపూర్వకంగానే మంత్రి కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్వీ నాయకులు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్వీ నాయకులు రమేశ్‌, జంగయ్యలు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేని రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారాలకు తెరలేపారని దుయ్యబట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఆంధ్రానాయకుల మెప్పు కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి రేవంత్‌ అని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడని మండిపడ్డారు. దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్లు లేని కబోదిలా తన స్వార్థం కోసం మంత్రిపై ఎన్‌జీటీలో కేసు వేయడం సిగ్గుచేటని విమర్శించారు.
logo