గురువారం 09 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 19:52:12

సీఎం కేసీఆర్‌కు ట్రస్మా అధ్యక్షుడి కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్‌కు ట్రస్మా అధ్యక్షుడి కృతజ్ఞతలు

హైదరాబాద్‌ : పరీక్షలు లేకుండా 2019-2020 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేయడాన్ని ట్రస్మా స్వాగతించింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై హర్షం ప్రకటిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రికగ్నజైడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) అధ్యక్షుడు వై. శేఖర్‌ రావు స్పందించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 5.34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం లభించిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సైతం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతులు తెలపాలన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగంలో పురస్కారాలు సాధించేలా కృషిచేస్తామన్నారు. 


logo