గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 14:58:57

యూత్ అంతా గులాబీ వైపే : మ‌ంత్రి హ‌రీష్ రావు

యూత్ అంతా గులాబీ వైపే : మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో యూత్ అంతా గులాబీ పార్టీ వైపే ఉంద‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. యూత్ ఒక్క‌రే కాదు.. రైతులు, మ‌హిళ‌లు కూడా టీఆర్ఎస్ పార్టీని వెన్నంటి ఉన్నార‌ని మంత్రి తేల్చిచెప్పారు. దౌల్తాబాద్ మండ‌లంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత‌కు మ‌ద్ద‌తుగా యువ‌త బైక్ ర్యాలీ నిర్వ‌హించింది. అనంత‌రం గులాబీ యువ గ‌ళం పేరిట స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొని ప్ర‌సంగించారు.

టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారానికి నాయ‌కులు, ప్ర‌జ‌లు స్వచ్ఛందంగా క‌ద‌లి వ‌స్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప‌రాయి లీడ‌ర్ల‌ను, కిరాయి మ‌న‌షుల‌ను తెచ్చుకుంటుంద‌న్నారు. చివ‌ర‌కు న‌ల్ల‌గొండ జిల్లా నుంచే కిరాయి జ‌న‌రేట‌ర్, సౌండ్ సిస్ట‌మ్ తెచ్చుకొనే ప‌రిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్ప‌డింద‌న్నారు. ఇవాళ దౌల్తాబాద్‌లో రెండు, మూడొంద‌ల బైక్‌ల‌తో ర్యాలీ నిర్వ‌హిద్దామ‌నుకుంటే.. ఏకంగా 1000కి పైగా బైక్‌ల‌పై యువ‌త ర్యాలీకి త‌ర‌లివ‌చ్చింద‌న్నారు. ప్ర‌తి గ‌ల్లిలో, గ్రామంలో గులాబీ జెండా రెప‌రెప‌లాడుతుంద‌న్నారు. ప్ర‌తి మ‌నిషిలోనూ గులాబీ నినాదం మార్మోగుతుంద‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.  


logo