ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 19:19:05

రూ.10వేలు ఆపినవాళ్లు.. రూ.25వేలు ఇస్తారా?: మంత్రి కేటీఆర్‌

రూ.10వేలు ఆపినవాళ్లు.. రూ.25వేలు ఇస్తారా?: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: నగరంలో  వరద బాధితులకు రూ.10వేలు ఇస్తుంటే మోకాలు అడ్డుపెట్టింది ఎవరు? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.  అర్హులైన వారందరికీ వరద సాయం అందజేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  శనివారం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో  మంత్రి కేటీఆర్‌  పాల్గొన్నారు.  

'వరద సాయాన్ని ఆపిన బీజేపీ నేతలు రూ.25వేలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇవ్వకుండా బీజేపీ నేతల్ని ఎవరు ఆపారు?  టీఆర్‌ఎస్‌ రూ.10వేలు ఇస్తామంటే ఆపినవాళ్లు..ఇప్పుడు రూ.25వేలు ఇస్తారట. ఇది అమాయకపు అహ్మదాబాద్‌ కాదు..హుషార్‌ హైదరాబాద్‌.  గత ఎన్నికల్లో ఒక్క సీటుతో మనం సెంచరీ కోల్పోయాం. ఈసారి జీహెచ్‌ఎంసీ  ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ పార్టీ శతకం పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ప్రశాంతమైన హైదరాబాద్‌ కోసం టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి.  మీ కోసం పనిచేసే వారిని తిరిగి కార్పొరేషన్‌కు పంపించాలని' కేటీఆర్‌ కోరారు.